TEJA NEWS

సీపం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.20,56,562 లక్షల ఆర్థిక సాయం

ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సీఎం చంద్రబాబు నాయుడు ది పెద్దమనసు : తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం:

నియోజకవర్గంలోని 25 మంది బాధితులకు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కాకానీ నగర్ కార్యాలయంలో సీఎం సహయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆపరేషన్‌ మరియు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం చంద్రబాబునాయుడు మంజూరు చేసిన రూ.20,56,562 /-ల చెక్కులను 25 మందికి పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదప్రజల సహాయార్థం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయటం ఆనందదాయకమన్నారు.

కూటమి ప్రభుత్వం అందించిన ఈ సహాయనిధి ద్వారా సుమారు 25 మంది జీవితాలు నిలబడుతున్నాయన్నారు. కార్యక్రమంలో చందర్లపాడు, నందిగామ,కంచికచర్ల, వీరులపాడు మండలాలతో పాటు పట్టణ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు.


TEJA NEWS