
పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా…. ముఖ్య మంత్రి సహాయ నిధి…. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ….
రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ధోనికల నరేష్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృషికి రావడంతో వారికీ ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 1లక్ష రూపాయల LOCని హన్మకొండ కనకదుర్గ కాలనిలోని ఎమ్మెల్యే నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందిస్తోందని అన్నారు. ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
