First Anniversary Celebration of Ayyappa Swamy Temple
అయ్యప్ప స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకకు హాజరుకావాలని మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు కి ఆహ్వానం
శంబిపూర్ రాజు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్
మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ని వారి కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ఛైర్మెన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు.
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ,26వ డివిజన్ లో జూన్ 8-06-2024 శనివారం శ్రీనివాస నగర్ లో శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడే శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్సీ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు దంపతులను శాలువాతో సత్కరించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్,శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.