న్యూఢిల్లీ:మార్చి 01
సార్వత్రిక ఎన్నికల సమరంలో బరిలోకి దిగే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ బీజేపీ ఖరారు చేసింది.
గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల యంలో జరిగిన ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుమారు 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు చేసి జాబితాను రూపొం దించింది.
ఈ జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తెలంగాణ, రాజస్థాన్, గోవా, గుజరాత్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థులపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చించింది.
ఈ మేరకు ఆయా రాష్ట్రాల బీజేపీ కోర్ కమిటీలను కమలనాథులు ఢిల్లీకి పిలిపించారు. తెలంగాణ నుంచి ఢిల్లీ చేరుకున్న నేతల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు..
జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు న్నారు.