TEJA NEWS

తెలంగాణలో నాణ్యమైన విత్తనాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

తెలంగాణలో జూన్ 2వ తేదీ నుంచి ‘నాణ్యమైన విత్తనాల పంపిణీ’ కార్యక్రమం CM రేవంత్​రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12వేల గ్రామాలలో మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన రైతులకు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విత్తన పంపిణీ చేయనుంది. ఈ పథకంలో సుమారుగా 2500 నుంచి 3వేల క్వింటాళ్ళ వరి, కంది, పెసర, మినుము, జొన్న పంటల విత్తనాలను దాదాపు 40 వేల మంది రైతులకు పంపిణీ జరగనుంది.