TEJA NEWS

బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ధరలతో బంగారం సామాన్యులకు అందకుండాపోతోంది. అయితే, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో…
Gold Prices: పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ధరలతో బంగారం సామాన్యులకు అందకుండాపోతోంది. అయితే, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు బంగారంపై పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో డిమాండ్‌ పెరిగి.. ధరలు పెరుగుతున్నాయి.

దేశీయ మార్కెట్లలో మంగళవారం బంగారం ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరింది. తొలిసారిగా రూ.75వేలకు చేరువైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.900 పెరిగి తులం రూ.67,950కి చేరింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.980కి పెరిగి తులానికి రూ.74,130కి చేరింది. పెరిగిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే… చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.68,700లు పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.74,950లకు చేరింది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.67,950 లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.74,130కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,100లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,280లు పలుకుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950లు ఉంటే.. 24 క్యారెట్ల బంగారం రూ.74,130కి చేరింది.


TEJA NEWS