Spread the love

ఏఐజీ హాస్పిటల్‌కు మాజీ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌:
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ దవా ఖానకు వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించా యి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు.

కాగా, పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్‌, హాజరయ్యారు. రాకరాక బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌,ను చూడటానికి తెలంగాణ భవన్‌కు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చింది.

చాలారోజుల తర్వాత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు రావడంతో ఆయనను చూడాలని, ఆయనతో సెల్ఫీ దిగాలనే ఉత్సాహం తో యవకులు తరలివచ్చా రు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్‌ వస్తారని షెడ్యూల్‌ ప్రకటించిన ప్పటి కీ, ఉదయం 10గంటల నుంచే యువకులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు.