TEJA NEWS

ఎంపీపీని ,సన్మానించిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు, మేఘ యువసేన బృందం


వనపర్తి మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు కిచ్చారెడ్డిని మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు చుక్క రాజు బృందం మలిదశ ఉద్యమకారులు బోయ మురళి మండ్ల దేవన్న నాయుడు కిరణ్ ప్రవీణ్లతో కలిసి ఎంపీపీ చాంబర్లో మండల ప్రజా పరిషత్ పాలన కాలం ముగియడంతో ఎంపీపీ కిచ్చారెడ్డిని శాలువ కప్పి సన్మానించి గౌరవించారు అనంతరం వారు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఐదేళ్లలో మండల అభివృద్ధికి పాటుపడ్డారని మండలంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ఎంపీపీ కిచ్చా రెడ్డి ఎంతో కృషి చేశారని రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజల సేవకు అంకితం కావాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మెగా రెడ్డి యువ సైన్యం వంశమోని మోహన్ ఏటీఎం మహేందర్, పోలేపల్లి మోహన్ రాజ్ సూపర్ భాస్కర్ చుక్క చింటూ బీసన్న తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS