TEJA NEWS

అగ్ని ప్రమాదంలో నష్టపోయిన దుకాణదారుల్ని ఆదుకుంటాం :మాజీమంత్రి ప్రత్తిపాటి

  • ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించి, దుకాణదారులకు ధైర్యం చెప్పిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట పట్టణంలోని సుభానీ నగర్ లోని లాహిరి ఆసుపత్రి వద్ద అగ్నికి ఆహుతైన దుకాణ సముదాయాలను మాజీమంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పరిశీలించారు. దుకాణదారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న ఆయన, వారికి ధైర్యం చెప్పారు. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, 4 దుకాణాలు అగ్నికి పూర్తిగా కాలిపోయాయని, సుమారుగా రూ.10లక్షల నష్టం వాటిల్లిందని దుకాణదారులు మాజీమంత్రికి తెలియచేశారు. ఒక బార్బర్ షాపు, మూడు చిన్నపిల్లల ఆటవస్తువులు అమ్మే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయన్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి, దుకాణదారుల నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలని, ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు జరపాలని ప్రత్తిపాటి సంబంధిత అధికారులకు సూచించారు. దుకాణదారులకు అండగా ఉంటామని, జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియచేసి, వారిని ఆదుకునేందుకు చేయాల్సిందంతా చేస్తామని ప్రత్తిపాటి ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి వెంట నాయకులు నెల్లూరి సదాశివరావు, జవ్వాజి మధన్ మోహన్ఉన్నారు