
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల దుర్మరణం బాధాకరం : మాజీమంత్రి ప్రత్తిపాటి
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయకూలీలు దుర్మరణం చెందడం బాధాకరం. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. వినుకొండ మండలం శివాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లె వాసులు మరణించడం విచారకరం. తమవారిని కోల్పోయిన మృతుల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి.” అని ప్రత్తిపాటి ఒక ప్రకనటలో సూచించారు
