
అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించిన మాజీమంత్రి ప్రత్తిపాటి
- పనిప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలని బాధితులకు సూచించిన ప్రత్తిపాటి.
- ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చిన ప్రత్తిపాటి.
చిలకలూరిపేట: పట్టణంలోని భావనారుషి నగర్లోని హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు చిన్నం ఆదిబాబుని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. భాధితుడితో మాట్లాడి అతనికి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన మాజీమంత్రి .. ప్రమాదతీరుని అడిగి తెలుసుకున్నారు. ఆదిబాబుకి మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా చూడాలని ప్రత్తిపాటి వైద్యులకు సూచించారు. ప్రభుత్వం తరుపున సాయం అందేలా చూస్తామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం, ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న బాధితుల్ని కలిసిన ప్రత్తిపాటి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
కాలిన గాయాలు బాధిస్తాయని, జాగ్రత్తగా ఉండాలని ఆహారనియమాలు పాటించాలని ప్రత్తిపాటి వారికి సూచించారు. ప్రమాదతీరుపై బాధితుల్ని అడిగి ప్రత్తిపాటి వివరాలు తెలుసుకున్నారు. గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని వారు మాజీమంత్రికి చెప్పారు. పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎండలు అధికంగా ఉన్నందున వంటచేసేటప్పుడు, పొయ్యిలవద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్తిపాటి వారికి సూచించారు. అగ్నిప్రమాద బాధితులైన పూజ శ్రీనివాసరావు, సీతారావమ్మ, ప్రగడ జాలయ్య, వెంకటరమణ, కోటేశ్వరరావులతో మాట్లాడిన ప్రత్తిపాటి, అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు సూచించారు. మాజీమంత్రి వెంట నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, ఇనగంటి జగదీష్, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
