TEJA NEWS

ఒత్తిడి లేని విద్యార్జనతోనే మంచి ఫలితాలు : మాజీమంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేట :పది ఫలితాల్లో పట్టణస్థాయిలో తొలి, తరువాతి స్థానాల్లో నిలిచిన విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా అభినందించిన ప్రత్తిపాటి

పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిఒక్కరూ ఉన్నత చదువుల్లో మరింత బాగా రాణించాలని, ఒత్తిడిలేని విద్యార్జనతో విద్యార్థినీ విద్యార్థులు మంచి గుర్తింపు సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తాజాగా విడుదలైన పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని మాజీమంత్రి ప్రత్తిపాటి తన నివాసంలో అభినందించారు. స్థానిక వీ.వీ.ఐ.టీ, వికాస్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రత్తిపాటి హర్షం వ్యక్తంచేశారు. పట్టణస్థాయిలో తొలిస్థానంలో నిలిచిన ఇందుశ్రీ సహా తరువాతి స్థానాల్లో నిలిచిన బాల త్రిపుర, యోగేంద్ర వెంకటసాయినాథ్, యశ్విన్, హేమహారిక, దుర్గ, అశ్వినిలను మాజీమంత్రి పేరుపేరునా మెచ్చుకున్నారు.