TEJA NEWS

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని రైతుల తరపున డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలు అమలు కాక రైతులు గోస పడుతున్నారని తెలియజేసారు. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌, రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల రైతుబంధు వెంటనే అమలు చేయాలని పోస్టు కార్డు ఉద్యమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసి పంపారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.


TEJA NEWS