
గాయత్రి గ్రామర్ పాఠశాల విద్యార్థులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో గాయత్రి గ్రామర్ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు 500 పై మార్కులు వచ్చిన సందర్భంగా వారిని అభినందించి శాలువాతో సత్కరించారు..
అనంతరం పలు స్థానిక సమస్యలపై తన వద్దకు వచ్చిన నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— విద్యార్థుల,భావితరాల భవిష్యత్తుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు..
— తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి ముఖ్య ప్రాముఖ్యత ఇచ్చారన్నారు..
— రాష్ట్రంలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ పౌష్టిక పదార్థాలతో కూడిన ఆహారం అందించడం జరుగుతుందన్నారు..
— మన రాష్ట్రంలోని పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలలు, సంక్షేమ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
