TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యచరణలో భాగంగా పలు సమస్యలతో వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు, వినతిపత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతానన్నారు..

— నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు…