
*బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల విన్నపం మేరకు *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు..
అనంతరం బహదూర్ పల్లి డబల్ బెడ్ రూమ్ సొసైటీ సభ్యులు,లబ్దిదారులను, సంబంధిత ప్రభుత్వ అధికారుల ముందు వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపరని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
బహుదూర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ లో పేద ప్రజల దగ్గర నుండి పైసలు వాసులు చెయ్యడన్ని సొసైటీ సభ్యులను తీవ్రంగా ఖండించారు..
డబుల్ బెడ్ రూమ్ లో ఉన్న త్రాగునీటి సమస్యలు, డ్రైనేజి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..
ప్రభుత్వం నుండి వచ్చిన నోటీసుల వల్ల ఆందోళన చెందోద్దని ఆ నోటీసులకు రిప్లై లెటర్ రాసి సంబంధిత అధికారుల ఇవ్వాలని సూచించారు..
పేద ప్రజలపై మళ్ళీ ఇలాంటివి పునరావృతం చేస్తే సాహించేది లేదన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, బహదూర్ పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సాదు యాదవ్, సంబంధిత ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు, బహదూర్ పల్లి సీనియర్ నాయకులు, డబుల్ బెడ్ రూమ్ సొసైటీ సభ్యులు, డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
