
లబ్ధిదారునికి LOC ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ కు చెందిన తాటి శ్రీనివాస్ s/o తాటి బాలనర్సయ్య అనారోగ్య పరిస్థితులతో పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 2,50,000/-ల LOC అందజేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— ప్రవేట్ ఆసుపత్రిలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందుతుంది అన్నారు..
— సీఎం సహాయానిధి పేద ప్రజలకు కొండంత అండగా మారిందాన్నారు..
— నియోజకవర్గ ప్రజలు సిఎంఆర్ఎఫ్, ఎల్ వో సి లను సద్వినియోగం చేసుకోవాలన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజవర్గ ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా సంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
