TEJA NEWS

ఆపదలో ఉన్న మహిళకు లక్ష రూపాయల ఎల్వోసి మంజూరు పత్రాలను అందజేసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ గారు..

ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శ్రీవిద్య అనే మహిళ అనారోగ్యంతో శస్త్ర చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రిలో చేరడంతో, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని సంప్రదించి, ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందించేందుకు సహాయం చేయాలని కోరారు. తక్షణమే మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు స్పందించి, గౌరవ ఇంఛార్జ్ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష రూపాయల ఎల్.ఓ.సి ని మంజూరు చేయించారు. మంజూరైన లక్ష రూపాయల ఎల్వోసీ పత్రాలను సదరు భాదిత కుటుంబానికి ఈరోజు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు సచివాలయ ఆవరణలో అందజేశారు. ఆపద సమయంలో స్పందించి, తక్షణ సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారికి భాదిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇంచార్జులు వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.


TEJA NEWS