
తిప్పాపూర్ నుండి రాజన్న దేవాలయం వరకు ఫ్రీ బస్ సౌకర్యం
రాజన్న జిల్లా:
రేపు మహాశివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేము లవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఆలయఉత్సవ కమిటీ సభ్యులతో కలసి ఈరోజు ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ఆలయ అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాజన్న భక్తులకు శ్రేష్ట దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.
రాజన్న భక్తుల సౌకర్య నార్థం ప్రయాణికులకు తిప్పాపూర్ నుండి వేములవాడ దేవాలయం వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈరోజు ఉదయం ప్రారంభించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని ఆయన పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
