TEJA NEWS

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ భవనంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జర్దోసి మగ్గం వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఈ. సత్తయ్య ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు వారికి ఉచితంగా మగ్గం శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి ఉంటుందని తెలిపారు. మహిళలు 99 49 10 45 15 ఫోన్ చేయాలని తెలిపారు. ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ వారంలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. వచ్చేవారు 3 పాస్ ఫోటో లు, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని ప్రకటనలో తెలిపారు. వివరాలకు పై నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు.


TEJA NEWS