
ముగిసిన జర్నలిస్టు సత్యం అంత్యక్రియలు
-అంతిమ యాత్రలో పాల్గొన్న జర్నలిస్టులు
-నివాళులర్పించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతలు మామిడి సోమయ్య,బండి విజయ్ కుమార్
వేములవాడ,
గుండె పోటుతో మృతి చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వేములవాడ కమిటీ ఉపాధ్యక్షుడు గోగికార్ సత్యం అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం వేములవాడలో ముగిశాయి. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన సత్యం బౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం వేములవాడకు తరలించారు. సత్యం అంతిమ యాత్ర మధ్యాహ్నం వేములవాడలోని ఆయన నివాసం నుంచి స్మశాన వాటిక వరకు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ సత్యం బౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సత్యం అంతిమ యాత్రలో వేములవాడ కు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య,ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎండీ యూసుఫ్, రాజన్న-సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి,నాయకులు ఎండీ షరీఫ్, తొగరి కరుణాకర్, నడిగట్ల బిక్షపతి తదితరులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
