TEJA NEWS

సిపిఎం జిల్లా మహాసభ తీర్మానాంశాలపైనే భవిష్యత్ కార్యాచరణ

జిల్లా సిపిఎంనూతన కమిటీ ఎన్నిక
జర్నలిస్టులకు అండగా సిపిఎ…………నూతన జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు

వనపర్తి : భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ కేంద్ర రాష్ట్ర జిల్లా మండల మహాసభలను ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలుకుముందు సమస్యలపై చేసిన పోరాటాలు వాటి ఫలితాలపై మరో మూడు సంవత్సరాల భవిష్యత్తు సమస్యల పోరాటాలపై కార్యాచరణ దీర్ఘకాలిక ముసాయిదాను విడుదల చేస్తుందని నవంబర్ 10 11 వ తేదీలలో వీపనగండ్ల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన జిల్లా మూడవ మహాసభలో కమిటీ నిర్ణయించిన సమస్యల ముసాయిదాపైనే జిల్లా నూతన కమిటీ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జిల్లా నూతన కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పేర్కొన్నారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా మహాసభలో రాష్ట్ర కమిటీ 17 అంశాలతో కూడుకున్న ముసాయిదాను జిల్లా కమిటీ ముందు ఉంచిందని మూడు సంవత్సరాల పాటు ఆ సమస్యలపై పోరాడమే తమ లక్ష్యమని నూతన జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు తెలిపారు ఉపాధి హామీ పనులు గ్రామాల తోపాటు పట్టణ మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ ని ప్రభుత్వ అమలు చేస్తూ 600 కూలిగా నిర్ణయించి వారం వారం చెల్లించాలని జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు లిఫ్టుల నిర్వాసితుల ధరణి సమస్యలు పరిష్కరించి రైతు రుణమాఫీ వెంటనే రైతులకు చెల్లించాలని అలాగే మహిళలపై దాడులు లను గృహహింసలను అరికట్టి వడ్డీ లేని రుణాలు అభయ హస్తం ఇంటి పని చేసేవారికి గుర్తింపు కార్డులతో పాటు సంక్షేమ పథకాలు కల్పించాలని జిల్లాలోని యువతి యువకులకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పించే విధంగా నూతన కమిటీ కృషి చేస్తోందని జిల్లాగా ఏర్పడిన తర్వాత 14 మండలాల్లో నూతనంగా ఏర్పడిన ఐదు మండలాల కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని సొంత భవనాలు ఏర్పాటు చేయాలని జూనియర్ కళాశాల లు లేని మండల లో కళాశాలలను ఏర్పాటు చేయాలని నిరుపేదలకు ఇంటి స్థలాలు పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి కేంద్రం 10 లక్షలు రాష్టం ఐదు లక్షలు నిధులను మంజూరు చేయాలని, వనపర్తి మండలంలో 1185 మంది రైతులు 3200 ఎకరాల్ల అటవీ భూములను సాగు చేస్తున్నారని అందుట్లో 720 మంది గిరిజనలు మిగతా గిరిజనయేతర లు చాలా కాలంగా అటవీ భూములను సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని సాగు చేస్తున్న వారికి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వీటితోపాటు మొత్తం 17 అంశాలు ఇతర అంశాలతో కలిపి నూతన కమిటీ ఉద్యమాలు చేయనున్నట్లు వారుతెలిపారు.


జర్నలిస్టులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుంది-: జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదులుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా కంట్రిబ్యూటర్ గా ఫ్రీ లాంచ్ జర్నలిస్టులుగా పని చేస్తా ఉంటారని వారి సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరమనిఅలాంటి జర్నలిస్టులపై కొంతమంది రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని విలేకరులపై వారి కుటుంబాలపై దాడులు చేయడం హేహమైన చర్య అని జర్నలిస్టు రాసినవార్తపై ఇబ్బందులు ఎదురైతే చట్ట, న్యాయపరమైన చర్యలు చేపట్టాలని భౌతిక దాడు లు చేయడం సరైన పద్ధతి కాదని అలాంటి సమయంలో జర్నలిస్టులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని జర్నలిస్టుల సేవలు పొందే ప్రతి నాయకుడు ప్రతి పార్టీ వారికిఅండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు జర్నలిస్టులు ఎంప్లాయ్ గా కనీసం కూలీలుగా కూడా గుర్తింపు లేని వాళ్ళని వారికి అండగా ఉంటూ వారి తరఫున ప్రభుత్వాలతో పోరాడేందుకు సిపిఎం పార్టీ ఎప్పుడుసిద్ధంగా ఉంటుందని తెలియజేశారు
నూతన జిల్లా కమిటీ వర్గ సభ్యులుగా ఎండి జబ్బార్ డి బాల్రెడ్డి జిఎస్ గోపి ఏ లక్ష్మి మడ్ల రాజు జిల్లా కమిటీ సభ్యులుగా
ఎం ఆంజనేయులు మహబూబ్ పాషా ఎస్ రాజు ఎస్ రవిప్రసాద్ బి వెంకటేష్ ఆర్ఎస్ రమేష్ మండల కృష్ణయ్య బాల్య నాయక్ జి వెంకటయ్య పరమేశ్వర చారి వెంకట్ రాములు ఆది లు నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని పుట్ట ఆంజనేయులు తెలిపారు ఈ కార్యక్రమంలోమడ్ల రాజు లక్ష్మి ఆంజనేయులు బాల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS