కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు మరియు సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు 25 కోట్ల 41 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే నాలల విస్తరణ పనులను పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు రూ.11.55 పదకొండు కోట్ల యాబై ఐదు లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే నాల విస్తరణ నిర్మాణ పనులను GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడిగాంధీ .
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు 11.55 కోట్ల రూపాయలతో RCC బాక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని , ఈ RCC బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తిచేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
అభివృద్ధి,సంక్షేమం అగకూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు చేపడుతున్నామని, త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని,రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణ పనులను చేపట్టడం జరిగినది అని, యుద్ధప్రాతిపదికన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన నాల విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.నాల లో పేరుకుపోయిన మట్టిని పూడికతీత ద్వారా వెంటనే తొలగించాలని, నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం అధికారులకు ఇవ్వడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు ,నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని,ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అదేవిదంగా అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయం తో పని చేసి పనులలో పురోగతి సాధించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE ఆనంద్ ,AE జగదీష్ మరియు కాంట్రాక్టర్ PS రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.