TEJA NEWS

మహాలింగాపురంలో భారీ సెట్టింగ్ లో వినాయకుడు
నిత్య పూజలతో బిజీబిజీగా గణనాథుడి మండపాలు*
ఆకట్టుకుంటున్న గణేష్ మండపాలు*
అద్భుతంగా ఇంటీరియర్ అండ్ ఎక్స్ట్రీరియర్ డిజైన్స్*
భారీ సంఖ్యలో వీక్షించడానికి వస్తున్న ప్రజలు*

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామంలో భారీ సెట్లలో గజనాదుడు కొలువైనాడు. సర్ధార్ వల్లాయ్ పటేల్ యూత్ అసోసియేషన్, శివాజీ సేన యూత్ గణేష్, యువజన సంఘాల ఆధ్వర్యంలో బాహుబలి సెట్లను తలపించే విధంగా సెట్లు వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా భారీ సెట్ల లో ఆ గజనాదుడిని పెట్టండం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సెట్లలోకి వెళ్లి ఆ గజనాదుడి దర్శనం చేసుకోవాలని పర్యాటకులు సైతం రావడం సంతోషకరం. వేద పండితుల ద్వారా నిత్య పూజలు చేస్తూ గ్రామంలోని అన్ని మండపాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ప్రారంభమయ్యే పూజలు అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ భారీ సెట్లలో కొలువుదీరిన వినాయకుడి దర్శనానికి గ్రామంలోని ప్రజలు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకోవడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఒక్కసారి గజనాధుని దర్శించుకోవడానికి సెట్ లోపలికి వెళితే మళ్ళీ రావాలనిపించదు. అద్భుతమైన డిజైన్స్ తో చక్కటి లైటింగ్ తో ఇంటీరియర్ డిజైన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.


TEJA NEWS