కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరిన గంకల కవిత అప్పారావు
అరాచకపు ప్రభుత్వంనకు స్వస్తి పలికే సమయం వచ్చింది
విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో టిడిపి,బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఏమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకు,ఎమ్ పి అభ్యర్థి శ్రీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ 48వ వార్డులో 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు 48వ వార్డులో గల 31వ నెంబర్ బూత్ లో తెలుగుదేశం,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా 31వ నెంబర్ బూత్ లో ఇంటింటికి వెళ్లి టిడిపి,బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఏమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకు కమలం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని,ఎమ్ పి అభ్యర్థి శ్రీ భరత్ కు సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం జీవీఎంసీ కౌన్సిల్ లో ఎంతో కష్టపడడం జరిగిందని,నిశపాక్షపాతంగా వార్డు అభివృద్ధి కోరుకు కృషి చేయడం జరిగిందని,కూటమి అభ్యర్థులను కూటమి అభ్యర్థులను గెలిపిస్తే వారి సహాయంతో కొండవాలు ప్రాంతంను మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని,అరాచకపు ప్రభుత్వంనకు స్వస్తి పలికే సమయం వచ్చిందని,రానున్న రోజులలో రాష్ట్రం అప్పుల ఉబిలో నుంచి బయటకు రావాలంటే కూటమితో మాత్రమే సాధ్యమని గంకల అన్నారు. ప్రజలు రానున్న రోజులలో కూటమి గెలుపునకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ సత్యడా అప్పారావు,టీడీపీ మహిళ అధ్యక్షులు గీత,రొంగళి మహేశ్వరరావు,సి హెచ్ పద్మ,మానేపల్లి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.