TEJA NEWS

34లక్షల రూపాయల విలువ కలిగిన బంగారం వెండి దొంగతనం.. ఇద్దరు వ్యక్తులను అరెస్టు సొత్తు స్వాధీనం చేసిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు

రాష్ట్రస్థాయిలో చోరీలు చేస్తున్న దొంగలను అరెస్టు చేసిన సిఐ సుబ్బ నాయుడు బృందం.. అభినందించిన పలనాడు జిల్లా ఎస్పీ

పసుమర్రు గ్రామంలో నివసిస్తున్న ఎలగాల హనుమాయమ్మ అను మహిళ గత ఆరు రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి తన ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నది లోనికి వెళ్లి చూడగా ఇంటిలోని సామానులన్నీ చిందర వందరగా ఉన్నాయి బీరువా లో 42 సవర్ల బంగారం వెండి వస్తువులు రాగి ఇత్తడి బిందెలు కనిపించకపోవడంతో చిలకలూరిపేట రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై అనిల్ కుమార్ కేసును నమోదు చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశముల మేరకు నరసరావుపేట డి.ఎస్.పి నాగేశ్వరరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ఎస్సై అనిల్ కుమార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి చిన్న పసుమర్రు గ్రామంలో అనుమానితులుగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఫిర్యాదులో ఇవ్వబడిన బంగారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని మీడియా ముందు సమావేశపరిచినారు ఈ కేసును చాకచక్యంగా చేదించిన చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బ నాయుడు ఎస్సై అనిల్ కుమార్ రోసిబాబు సుబ్బారావు హెడ్ కానిస్టేబుళ్లు కే దేవరాజు శ్రీధర్ ఇర్మియ అశోకు రత్న కిషోర్ మధుబాబులను జిల్లా ఎస్పి అభినందించారు