TEJA NEWS

డయాలసిస్ రోగులకు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలి

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్
వనపర్తి
డయాలసిస్ రోగులకు ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు. ఆయన ఆత్మకూరు పట్టణంలో మాట్లాడుతూ డయాలసిస్ రోగులకు ₹2000 పెన్షన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం చాలా మందికి పెన్షన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉమ్మడి మండలాల్లో డయాలసిస్ చేసుకుంటున్నా రోగులకు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. ఆంధ్రాలో డయాలిసిస్ రోగులకు అక్కడి ప్రభుత్వం పెన్షన్ లిస్తుందని ఇక్కడ మాత్రం రోగులను గాలికి వదిలేసారని ఆరోపించారు. వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు యూనస్ సమీర్ వసీమ్ చరణ్ ఇమ్రాన్ పాల్గొన్నారు