కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్..
జగిత్యాల :హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన..
డ్రైనేజి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలి..
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్..
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను, పరిశీలించి O.P. సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. ల్యాబ్ విభాగాన్ని తనిఖీ చేసి టి-హబ్ కి పంపే డయాగ్నోస్టిస్ పరీక్షల రికార్డును కలెక్టర్ పరిశీలించారు. ఐ.సి. యు. కి సంబంధించిన పరికరాలను కలెక్టర్ పరిశీలించారు.
ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డుల నమోదు సరిగా ఉన్నాయా లేదా అని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా అని తెలుసుకున్నారు. హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కలను కలెక్టర్ పరిశీలించి ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏ మొక్కలు ఎక్కువగా పంపిణీ జరుగుతుంది, ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏమేమి ఉన్నాయి అని అడిగారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదే విధంగా డ్రైనేజి వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉండకుండా, ఇండ్లలోకి నీరు వెళ్ళకుండా నీటిని దారి మళ్లించి పెద్ద డ్రైనేజిని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల RDO మధుసుధన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమీయుద్దీన్, సంబంధిత అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.