గుడివాడలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు – టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ
ఎన్టీఆర్ స్టేడియం నుండి గుడివాడ ప్రధాన వీధుల గుండా టిడిపి కార్యాలయం వరకు 4వందల సైకిళ్లతో జరిగిన ర్యాలీ.
మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసిన రాము
కుటుంబ సమేతంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరచిన వేనిగండ్ల రాము
ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలి – నెహ్రూ చౌక్, నాగవరప్పాడు ఎన్టీఆర్ విగ్రహం, రాజేంద్రనగర్ ఈ సేవ రోడ్డు,రాజేంద్ర నగర్, ఎన్టీఆర్ కాలనీ,గుడ్ మెన్ పేట, ముబారక్ సెంటర్, పెద ఎరుకపాడు, బేతవోలు, జగన్నాధపురం, వరల వీధి మీదుగా ఏలూరు రోడ్డులోని టిడిపి కార్యాలయం (ప్రజా వేదిక) వరకు సాగింది.
వెనిగండ్ల రాము పాయింట్స్
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నేడు గుడివాడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.అభివృద్ధి ప్రదాత చంద్రబాబు,ద్వారానే రాష్ట్ర అభివృద్ధి.
ఐదేళ్లుగా సీఎం జగన్ రెడ్డి చేతిలో దగాపడ్డ వర్గాలన్నీ, చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నాయి.బాబు గెలిస్తేనే యువతకి జాబు వస్తుంది,రాష్ట్రం వెలిగిపోతుంది.
సీఎం జగన్ ప్రభుత్వం పై కసి,చంద్రబాబుపై ప్రేమ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది.వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బతికించేది చంద్రబాబె.
గుడివాడలో మార్పు మొదలైంది…. ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది యాత్రలో పాల్గొన్న సోదరులందరికీ ధన్యవాదాలు.చంద్రబాబు ఇప్పటికి నవ యువకుడు,ఇంత ఎండల్లో కూడా 20 గంటలు కష్టపడుతున్నారు.
రాత్రులు తిరిగి పగలు పడుకొనే-గుట్కా నానికు చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి లేదు.
సైకిల్ ర్యాలీలో గుడివాడ టిడిపి అధ్యక్షుడు దీంట్యాల రాంబాబు,రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, నందివాడ మండల అధ్యక్షుడు దానేటీ సన్యాసిరావు,గుడ్లవల్లేరు మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్,గుడివాడ బిజెపి కన్వీనర్ దావులూరు సురేంద్ర బాబు, గుడివాడ బిజెపి అధ్యక్షుడు ఎర్రపోతు అర్జున్, గుడివాడ టౌన్, రూరల్, నందివాడ మండలం, గుడ్లవల్లేరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.