నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు
*తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య
తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఔట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తుడా అధికారులను ఆదేశించారు. తుడా పరిధిలోని రేణిగుంట, వడమాలపేట, చంద్రగిరి వద్ద ఏర్పాటు చేసిన లేఔట్లలో కల్పించిన వసతులను తుడా అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ తుడా పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఔట్లకు అధికారులు స్వయంగా వెళ్లాలని అన్నారు. అక్కడ మన నిబంధనల మేరకు వారు సమర్పించిన ప్లాన్ ప్రకారం అన్ని ఉన్నాయా? లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా లేఔట్ లో ప్లాట్ల మధ్య రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ స్పేస్, ఎలక్ట్రికల్ లైన్స్, నీటి సౌకర్యం ఉందా అని పరిశీలించాలని అన్నారు. ఆలా నిబంధనలకు అనుగుణంగా అన్ని ఉన్న లేఔట్లకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. అలా కాకుండా అనుమతులు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఓ దేవి కుమారి, ఏపిఓ సూర్యనారాయణమ్మ, జె పి ఓ లు, ఇతర ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.
నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు
Related Posts
ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు
TEJA NEWS ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం అమరావతి: అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరం తీర్చిదిద్దడంతోపాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత, పరిశోధనల ఫలాలను…
వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు కంపోస్టుగా మార్చండి.. కమిషనర్ ఎన్.మౌర్య
TEJA NEWS వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు కంపోస్టుగా మార్చండి.. *కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరంలో వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్ (బల్క్ జనరేటర్స్) వారు తడిచెత్తను…