
యువతి యువకులకు గొప్ప శుభవార్త, టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఐక్యత పౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా ఉందని, నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు, పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సిస్టమ్స్, ఇండస్ట్రియల్, ఇంజనీరింగ్, పూర్తిచేసి ఉత్తీర్ణత కలిగిన, నియోజకవర్గ నిరుద్యోగ, యువతకు, మార్చి 25న కల్వకుర్తిలో మెగా జాబ్ మేళా ఉందని, నిరుద్యోగ యువతీ, యువత హాజరుకావాలని, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు, వయసు సుమారుగా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలన్నారు, విద్యార్థుల అర్హత పట్టి జాబ్ సెలక్షన్ ఉంటుందన్నారు, చదివిన చదవకున్న, ఈ జాబ్ మేళలో వివిధ రకాల ఉద్యోగాలు, ఉంటాయన్నారు, ఈ జాబ్ మేళలో దాదాపు 52 ప్రముఖ కంపెనీలు పాల్గొనను ఉన్నాయని, ప్రస్తుతానికి 40 కంపెనీలు, రిజిస్టర్ నమోదు చేసుకున్నాయని, అందులో ఐదు వేల ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు.
