TEJA NEWS

జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ నామ శుభాకాంక్షలు

జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పత్రికా రంగానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా పత్రికలు నిలుస్తాయని, ప్రజలకు నిజమైన సమాచారం అందించడం ద్వారా సమాజ అభ్యున్నతికి కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పాత్రికేయులు తమ నైపుణ్యంతో సత్యాన్వేషణ చేస్తూ సమాజంలో న్యాయాన్ని, సమానత్వాన్ని నెలకొల్పడంలో కీలక పాత్రను పోషిస్తున్నారని కొనియాడారు.

ఆధునిక యుగంలో సాంకేతికత సాయంతో సమాచారాన్ని వేగంగా, నమ్మకంగా ప్రజల దాకా చేరవేయడంలో పాత్రికేయుల కృషి ప్రశంసనీయమని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే పత్రికల పాత్ర సామాన్య ప్రజలకు ఆశాకిరణమని అభివర్ణించారు. సమాజంలో పత్రికలు నైతిక విలువలు నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. పాత్రికేయుల నిబద్ధత, త్యాగాలు, ధైర్యం వారికి గొప్ప గౌరవాన్ని తీసుకువస్తాయని, వారు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా న్యాయం, సత్యం కోసం కట్టుబడి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సోదర, సోదరిమనులకు, పత్రికా రంగంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పత్రికా రంగం సమాజంలోని మార్పులకు దోహదం చేస్తూ ప్రజల అభిప్రాయాలను గౌరవించే వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. మీడియా సత్యాన్వేషణలో ఒక జ్యోతిలా ప్రజాస్వామ్యానికి అండగా ఉంటే, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.


TEJA NEWS