TEJA NEWS

గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా ఉంది. దీనివల్ల ఈ మార్గంలో న‌డిచే రైళ్ల సమయం ఆలస్యమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు-నడికుడి-బీబీనగర్ మార్గం అత్యంత కీలకమైంది. దీని పొడవు 239 కిలోమీటర్లు. ఎప్పటినుంచో దీన్ని డబుల్ లైన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో స్పందించిన కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. డబుల్ లైను అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంది.


TEJA NEWS