రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..
తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని ఆకాంక్షించారు..
సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని కోరారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకురావడమే తెలుగుదేశం పార్టీ సంక్రాంతి సంకల్పమని స్పష్టం చేశారు. భోగభాగ్యాల భోగి, సకల శుభాల సంక్రాంతి, కన్నుల పండువగా కనుమ పండగలు జరుపుకోవాలని సూచించారు..
మరోవైపు.. తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబట్టి అందరికీ ప్రత్యేకమేనన్నారు..