
శ్రీకాకుళం జిల్లా పోలీసు.
భారీగా గంజాయి స్వాధీనం.
వాహన తనిఖీల్లో పట్టుబడిన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న నరసన్నపేట పోలీసులు.
ముందస్తు సమాచారంతో మడపాం టోలేట్ ప్లాజా వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు చేపడుతున్న సమయంలో ఒడిస్సా రాష్ట్రం, గంజాం జిల్లా సుబలై గ్రామానికి చెందిన తుఫాన్ కరియా అనే వ్యక్తి వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నట్లు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు.తుఫాన్ కరియా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ నందు రితీష్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడిను. ఈ సమయంలో తుఫాన్ కరియా ఒక వాహనంలో నుంచి దిగిపారిపోతుండగా వెంబడించి పట్టుకొని కేసు నమోదు చేసి 24 కేజీల గంజాయని స్వాధీనం చేసుకున్నట్లు నర్సన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు కేసు వివరాలను బుధవారం తెలిపారు.
