Spread the love

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

విజయవాడ : ఏపీలో తమ ఆదేశాలను లెక్క చేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ మండిపడింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే తప్ప, ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదని ఫైరయ్యింది. ఇలాంటి తీరును తాము సహించబోమని హై కోర్ట్ హెచ్చరించింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ పోలీసుల తీరుపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.