How can you give to a private university without giving to the poor
పేదలకు ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రైవేట్ యూనివర్సిటీకి ఎలా ఇస్తారు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
గాజులరామరం డివిజన్ సర్వే నెంబర్ 343 లో ఉన్న 5 ఎకరాల భూమిని కే ఎల్ యూనివర్సిటీ కి కేటాయిస్తున్నారని పత్రికల్లో రావడం చూసి నేడు సీపీఐ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయంలో స్థానిక ఎమ్ ఆర్ ఓ లేకపోవడంతో ఇన్వార్డులో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు మాట్లాడుతూ పేద ప్రజలు ఇండ్లు లేని వారికి 60 గజాల స్థలం ఇవ్వమంటే ప్రజల ను అరెస్టు చేయించే అధికారులు,కోట్లాది రూపాయల వ్యాపారం చేసే వారికి స్థలం కేటాయించడం దుర్మార్గమని అలాంటి నిర్ణయం తీసుకుంటే వెంటనే ఉపసంహరించుకోవాలని వినతిపత్రంలో తెలియచేసారు.
ఒకవేళ అధికారులకు, ప్రభుత్వానికి,కబ్జాదారులకు డబ్బులు కావాలంటే ఇండ్లు లేనివారి దగ్గర వసూలు చేసి ఇస్తామని 60 గజాల స్థలం కేటాయించాలని కోరారు.
లేనిపక్షంలో మరోసారి భూపోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావ్, శ్రీనివాస్, రాములు, శాఖ నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు.