హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
గజ్వేల్ :
గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ లో బుక్స్, డ్రెస్ లు పూర్తి స్థాయిలో ఇంకా అందలేదని త్వరితగతిన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ లు పంఫిణి చేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) అధ్వర్యంలో విద్యా హక్కుల ఉద్యమంలో బాగంగా ఎడ్యుకేషన్ హబ్ కి వెళ్ళిన సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి బృందం దృష్టికి విద్యార్థులు తిసుకొచ్చరన్నారు. ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ గజ్వేల్ ప్రపంచశ్రేణి ప్రమాణాలతో ఇరవై ఎకరాలలో బాలికల కోసం విద్యాహబ్ కిలోమీటర్ దూరంలో నలపై ఎకరాలలో బాలుర కోసం ఎర్పాటు చేసిన విద్యాహబ్ లో ఆరవ వ తరగతి నుండి పీజీ వరకు ఒకే దగ్గర విద్యా అందాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్ లో ఈ ఆర్థిక సంవత్సరం లో బుక్స్, డ్రెస్ లు పూర్తి స్థాయిలో ఇంతవరకు అందలేదన్నారు.ఒక వైపు ప్రైవేటు కు దిటుగా విద్యానందిస్తామని చెబుతూనే మరొపక్క వసతులు కల్పించడం లేదన్నారు. బాల, బాలిక విద్యా సముదాయాల్లో 140 కోట్ల తో నిర్మించిన ఆడిటోరియం లు శితిలవస్థకు వచ్చిన పట్టించుకునే నాదుడేలేదన్నారు.మరుగుదొడ్లు, కిటికిలు ద్వంసమై కొట్లాది రూపాయలు వృదాగాపొతున్నయన్నారు. ఈ ఆడిటోరియాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తే బాల, బాలికలకు సెమినార్ లకు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతగానొ ఉపయోగపడుతదన్నారు. హస్టల్ విద్యార్థులకు మద్యాహ్న బోజనం అద్వనంగా ఉండటం వలన తినిలేకపొతున్నరని బృందం దృష్టికి తిసుకొచ్చారు విద్యార్థులు. వెంటనే ప్రభుత్వం నాణ్యమైన బోజనంతో పాటు, బుక్స్, డ్రెస్ లు ఇచ్చి, ఆడిటోరియం పూర్తి స్థాయిలో అందుబాటులొకి తెచ్చి విద్యార్థుల చదువుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం లో మాసన్ పల్లి మైసయ్య, రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు.