పేటలో హైడ్రా హడల్
నివాసాలు నేలమట్టం అవుతాయని భయబ్రాంతులకు గురవుతున్న సూర్యాపేట సద్దుల చెరువు పరిసరప్రాంత ప్రజలు
సూర్యపేట జిల్లా : రేవంత్ సర్కార్, హైడ్రా కమిటీ ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లను సర్వే చేయడం కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు నెహ్రు నగర్ లో ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు సిబ్బంది వస్తే అక్కడున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా గుంపులుగా సిబ్బంది దగ్గరికి వెళ్లడంతో వెనుదిరిగి వెళ్లిపోయిన సంయుక్త శాఖ అధికారులు. గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నివసిస్తుంటే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని, తమ ఇళ్ళను కూలిస్తే ఎలా బ్రతకాలని కంటతడి పెడుతూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.