ఎంపీ ఎన్నికల్లో గెలిపించండి..
టీడీపీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామ
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ కి లేఖ రాశా
తెలుగుదేశం పార్టీతో నాకు ఉన్న అనుబంధం ఎవరు వేరు చేయలేనిది
ఖమ్మం లో జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్టీఆర్ కు నివాళు అర్పించిన బీ.ఆర్.యస్ పార్టీ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్పూర్తితో, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చానని బీ.ఆర్.యస్ ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఉదయం ఖమ్మం లోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఆయన అక్కడ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డా. వాసిరెడ్డి రామనాథం తో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు అనంతరం అక్కడ టీడీపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తను ఎంపీ గా ఉండి పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం కృషి చేసి పట్టుబట్టి పార్లమెంట్ హాల్ లో అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టించడం జరిగిందని అందుకు చాలా గర్వంగా, అదృష్టంగా బావిస్తున్న అన్నారు అలానే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ కి లేఖ రాయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఎవరు వేరు చేయలేరని పేర్కొన్నారు. ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతినేలా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు అద్వర్యం లో వెళ్లి పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయడం జరిగిందని ఆ సమయం లో అక్కడ పోలీస్ వారు చేసిన లాఠీ ఛార్జ్ లో చంద్రబాబు కు తగలబోయిన లాఠీ దెబ్బకు అడ్డు వెళ్లి ఆ లాఠీ దెబ్బ తిన్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో తనది అన్నారు.
రాజకీయాలకు అతీతంగా టీడీపీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు అండగానే ఉన్నానని భవిష్యత్ లో కూడా అలానే ఉంటానని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనాడు చేపట్టిన సైకిల్ యాత్రను, బాబు పాదయాత్ర సందర్భంగా పైలాన్ ఏర్పాటు సహా పలు విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లాలో ఎన్నో చోట్ల ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు సహా పార్టీ కార్యాలయాల నిర్మాణం లో తనక్ పాత్ర ఉందని తెలిపారు ప్రస్తుతం ఉన్న రాజకీయాలను గమనించి టీడీపీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొండబాల కరుణాకర్, తాళ్లూరి అప్పారావు, సానెబోయిన శ్రీను, పాలడుగు కృష్ణప్రసాద్, నల్లమల రంజిత్, మందటి నరేష్, వకుంతల వంశీ, మందపల్లి కోటి, కూచిపూడి జై, రజని, స్వప్న, నల్లమల శ్రీను, దామా శ్రీను సహ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.