TEJA NEWS

అమ్మ దయ ఉంటే అన్నీ సమకూరుతాయి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ భూదేవి హిల్స్ నందు నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన & నాభీశిలా (బొడ్రాయి) ప్రతిష్ట మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పెద్దమ్మ తల్లి దయ ఉంటే అన్ని సమకూరుతాయని, అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు. అనంతరం భూదేవి హిల్స్ లో నిర్వహించిన నాభీశిలా (బొడ్రాయి) ప్రతిష్టాపనలో బొడ్రాయికి కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు బాబు గౌడ్, విఠల్, శశిధర్, జైహింద్, తిరుమల్ రెడ్డి, మల్లా చారి, తిరుపతి, దినేష్, సత్యనారాయణ, మెట్ల శ్రీను, ఎర్ర లక్ష్మయ్య, బ్రహ్మానంద చారి, మహంకాళి, వెంకటేష్, అజం, ప్రభాకర్, ఆంజనేయులు, నాగరాజు, ముంతాజ్, నవీన్, రాజు, సురేష్, మధు, సోమయ్య,
తారా సింగ్, మహిళా నాయకురాలు త్రివేణి, మంజుల, పార్వతీ, పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు బాలకృష్ణ, భూదేవి హిల్స్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.