TEJA NEWS

తాడేపల్లి

షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరనుందన్న ప్రచారానికి ఇప్పుడు ఆర్కే వ్యాఖ్యలు తోడయ్యాయి.వైయస్ షర్మిలతోనే తన ప్రయాణం సాగుతుందని శనివారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
షర్మిల కాంగ్రెస్ లో చేరే నిర్ణయం ప్రకటించాక ఆమె వెంటే నడుస్తానన్నారు ఆర్కె. ఇటీవలే వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ప్రభుత్వం తన నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.తాను రాజకీయాల్లో ఉన్నా, లేకపోయినా చంద్రబాబు. లోకేష్ లపై కేసులు వేస్తానని అన్నారు. వారేకాదు సీఎం జగన్ తప్పులు చేసిన కేసులు వేస్తానన్నారు ఎమ్మెల్యే ఆర్కే. ఇప్పుడు ఆర్కే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.షర్మిల తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని ఆర్కే అన్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా..ఆమె వెంటే ఉన్నానన్నారు. వైసీపీకి తాను ఎంత సేవ చేశానో అందరికీ తెలుసన్నారు.
జగన్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. గతంలో ఇక్కడ గెలిచినా, అధికారంలో ఉన్నా టీడీపీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టే తనను గెలిపించారన్నారు. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరితే తానూ కాంగ్రెస్ లో చేరతానన్నారు. వైసీపీలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకపోతే ఎలా పనిచేస్తాం..అందుకే వైసీపీకి రాజీనామా చేశానని చెప్పారు.


TEJA NEWS