
ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ఎక్స్ పెరిమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ ఎన్ సూర్యారావు అన్నారు.
చిట్టినగర్ లోని గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్ లో బుధవారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విభిన్న రకాలైన ఆవిష్కరణలు చేసి ఔరా అనిపించారు.
మానవుని జీవిత చరిత్ర, సంపూర్ణ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనారోగ్యానికి గల కారణాలు ఇలా పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించిన తీరు వీక్షకులను ఆశ్చర్య చకితులను చేశాయి.
డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ సూర్యారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి సైన్స్ ఎక్స్ పెరిమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయాన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయవచ్చన్నారు.
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సదస్సును ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ఇలాంటి నూతనమైన ఆవిష్కరణలు, పరిశోధనలతో భవిష్యత్తు శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పీ తులసి ఎన్డీయే కూటమి నేతలు బీ ఎస్ కే పట్నాయక్,ధీటి ప్రభుదాస్, అవ్వారు బుల్లబ్బాయి, వెంపలి గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
