
ఈస్టర్ పండుగను పురస్కరించుకొని
ప్రత్తిపాటి ఆదేశాలతో శ్మశాన వాటికల్లో జంగిల్ క్లియరెన్స్…
చిలకలూరిపేట : ఈనెల 20-04-2025 వ తారీకు జరగబోవు క్రైస్తవ సమాజానికి ప్రధానమైన పండుగఅయిన “ఈస్టర్” పండుగ సందర్భంగా స్మశానవాటికలు అభివృధి పరచాలని మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, కొండ వీరయ్య, కొండేపాటి రమేష్, తదితర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు తీసుకెళ్లడంతో, ఈస్టర్ పండుగను జరుపుకునే విధంగా శ్మశాన వాటికలలోని పిచ్చి మొక్కలను తొలగించి బోర్ల మరమ్మతులు చేపట్టాలని
మున్సిపల్ అధికారులకు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని,ఆయన ఆదేశాల మేరకు
పట్టణంలోని ఏ.ఏం.జి.పక్కనున్న స్మశాన వాటిక, ఆది ఆంధ్ర కాలనీకి సంబంధించిన పురుషోత్తం పట్నంలోని స్మశాన వాటిక, రాగన్నపాలెం స్మశాన వాటిక, చీరాల రోడ్డు వెంగళ రెడ్డి నగర్ స్మశాన వాటిక శారద హైస్కూల్ పక్కన ఉన్న శ్మశాన వాటికలను పూర్తి స్థాయి లో జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు .శ్మశాన వాటికలలో జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,టీడీపీ నాయకులు మద్దుమాల రవి,కొండ వీరయ్య,
గట్టుపల్లి మాణిక్యాలరావు , మచ్చ వెంకటేశ్వర్లు,ముకిరి వీరాంజనేయులు, కొండె పాటి రమేష్ లు శ్మశాన వాటికలలో జరుగుతున్న పిచ్చి మొక్కల తొలగింపు పనులు పరిశీలించారు.. ఈ సందర్భంగా
శానిటరీ ఇన్స్పెక్టర్ లు రమణారావు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న శ్మశాన వాటికలు అన్ని జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. టెలిగ్రాఫ్ ఆఫీసు ఎదురు ఏ.ఏం.జి పక్కనున్న శ్మశాన వాటిక రెండు రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శ్మశాన వాటికలో యంత్రాల తో కాకుండు మనుషులు ద్వారా పిచ్చి మొక్కలు,గడ్డి తొలగించటం వలన ఆలస్యం అవుతుందని పండగకు అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుందనీ తెలిపారు,
