
తెలంగాణలో పేదవాడి సొంతింటి కళ కలగానే మిగిలింది
ఇందిరమ్మ గృహ నిర్మాణంలో ప్రభుత్వం మెలికలు
లబ్ధిదారుల సంఖ్య లక్షలు- అర్హులైన అభ్యర్థులు వందలు:
ఏ పథకం చూసిన -పలితం శూన్యము…………….
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్ ఆరోపణ
వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలోఏ ప్రభుత్వం వచ్చినా మాయ మాటలు గారడి కథలు చెప్పి ఓట్ల దండుకొని అధికారంలోకి రావడం తప్ప పేద ప్రజలకు కనీస అవసరాలలో ముఖ్యమైన గృహ నిర్మాణం సొంత ఇంటి కల నెరవేర్చలేకపోవడం ప్రజల దౌర్బాగ్యమని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాల కాలం అయినా కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలుకు నిరాశ మింగించిందని .
ప్రస్తుతం సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణానికి గుండు సున్నా చూపిస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ సోమవారం ప్రకటనలో ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కూడా పేద ప్రజలకు గృహ నిర్మాణాన్ని సొంత ఇంటి కల నెరవేర్చలేకపోవడంలో ఘోరంగా విఫలమైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కొన్ని లక్షల కోట్ల మంది పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం చేపడుతున్నాడని ప్రధానమంత్రి గృహ నిర్మాణం పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విధులు మంజూరు చేస్తుందని అట్టి నిధులను అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి స్థలం కలిగిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని ఆ తర్వాత గృహ నిర్మాణ పథకానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులలో దాదాపు 50 లక్షల దరఖాస్తులు ప్రజలు ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం చేతకాక ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ మొక్కుబడిగా గ్రామాలలో ఒక్కరు లేదా ఇద్దరికీ మాత్రమే ఇల్లు మంజూరు చేస్తుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి విడత లో ప్రతి మండలంలో కేవలం ఒక గ్రామం మాత్రమే ఎంపిక చేసి ఆ గ్రామంలో కూడా ఒకరిద్దరు లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఒకటి తర్వాత ప్రభుత్వం మాట మార్చిందని అన్నారు. ఎల్1. ఎల్ 2. ఎల్ 3. మూడు దశల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అంతర్యం ఏముందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎల్ 1 కింద ఎంపికైన లబ్ధిదారులకు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వకుండా నిర్మాణాలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎల్ 1 కింద ఇంటి స్థలం కలిగిన ఇల్లు లేని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఎల్ 2 కింద ఇల్లు ఇంటి స్థలం లేని లబ్ధిదారులను గుర్తించింది. అదేవిధంగా ఎల్ 3 లో పక్కా ఇల్లు కలిగిన లబ్ధిదారులు ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు బ్యాంకుల్లో 50 వేల రుణం అప్పు ఉన్న లబ్ధిదారులు అదేవిధంగా ద్విచక్ర వాహనం రెండున్నర ఎకరాల భూమి ట్రాక్టర్. కార్లు కలిగిన లబ్ధిదారులను గుర్తించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ విషయం చెప్పకుండా ఎన్నికల తర్వాత దొంగ నాటకాలకు చెరలేపుతుందని బిజెపి నాయకుడు మున్నూరు రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి కొర్రీలు కండిషన్లు లేకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయలేక ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను గమనించి కేవలం మొక్కుబడిగా ఈ పథకాన్ని ఎక్కడో ఒకచోట కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా అమలు చేస్తుందని అన్నారు. అంతేకాక 400 చదరపు గజాల కంటే తక్కువ 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులు ఈ పథకానికి అర్హత లేదని కేవలం నిబంధనల ప్రకారం అర్హత ఉన్న లబ్ధిదారులకే ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది ముందే వర్షాకాలం ఈదురు గాలులు భయంకరమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద కుటుంబాల చెందిన లబ్ధిదారులు పూరి గుడిసెల్లో మట్టి మిద్దెలలో బిక్కు బిక్కు మని కాలం వెలదీస్తున్నారు. అలాంటి లబ్ధిదారులకు ఇంద్రమ్మ పథకంలో ఎంపిక చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలోని నాయకులకు కార్యకర్తలకు ఈ పథకంలో చోటు కల్పించిందని బిజెపి నాయకుడు మున్నూరు రవీందర్ ఆవేదన చేశారు. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీల పేరుతో ఆ పార్టీ నాయకులకే ఈ పథకం అప్పజెప్పిందని అయినా కూడా ఈ పథకం అబ్బాస్ పాలవుతుందని అన్నారు. ఇప్పటివరకు మొదటి విడత ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఇల్లు నిర్మించిన కూడా బిల్లు రాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మున్నూరు రవీందర్ ఆరోపించారు. కేవలం ప్రతి నియోజకవర్గంలో కుంటి సాకు చెప్పుకోవడానికి మాడల్ ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని నిర్మించింది అని అలాంటి మోడల్ హౌస్ పేద ప్రజలకు ప్రభుత్వమే సొంతంగా నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా సిమెంటు. ఇనుము. ఇసుక. కంకర. ఇటుక ధరలతో ప్రజలు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్వయంగా ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రతి ఒక్కరికి నిర్మించి ఇవ్వాలని అప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడుతుందని ఆయన డిమాండ్ చేశారు. కేవలం భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధాని ఆవాస్ యోజన పథకం అద్భుతంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతుందని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆ నిధులను తెలంగాణ రాష్ట్రం పక్కదారి పట్టిస్తూ పేద ప్రజలకు గృహ నిర్మాణం లేకుండా గుడ్డిగా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు మొదటి విడత ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక లో 71 వేల నిర్మిస్తున్నట్లు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయినా ఈ పథకం ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. మే 12, 2025 సంవత్సరం నాటికి రెండో విడతల అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు రెండో విడత లబ్ధిదారుల జాబితా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. కేవలం ఈ ప్రభుత్వం ఆలయాపన కోసం అధికారం కోసం ప్రజలను మభ్యపెడుతూ మాయమాటలతో గారడి చేస్తుందని బిజెపి నాయకుడు మున్నూరు రవీందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే ఈ రాష్ట్రం అప్పులో రాష్ట్రంగా దివాలా తీసింది అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం ప్రజలు గమనిస్తున్నారని ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బిల్లులు ఈ ప్రభుత్వం చెల్లించే పరిస్థితిలో లేదని ప్రజలు నమ్మలేకపోతున్నారని అన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇంటి స్థలం కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం స్పష్టంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిందని వెంటనే ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా వ్యతిరేకత రోజురోజుకు ప్రభుత్వం పైన తీవ్ర రూపం దాల్చిందని అన్నారు.
