TEJA NEWS

కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక కేజీ 5రూ.. మాత్రమే
కోటగుమ్మం వద్ద వైఎస్ఆర్సిపి వినూత్న నిరసన
నిరసనలో పాల్గొన్న పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు

రాజమహేంద్రవరం :
ఉచిత ఇసుక పేరుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లారీ ఇసుక 3 వేలకు విక్రయించడం జరుగుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం చెందిందని, ఉచిత ఇసుక బూటకం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉచిత ఇసుక కేజీ ఐదు రూపాయలు మాత్రమే అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్థానిక కోటగుమ్మం వద్ద మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్
ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వినూత్న నిరసన నిర్వహించాయి. తోపుడు బండ్లపై ఇసుక రాశిగా పోసుకుని కేజీల చొప్పున తూకం వేస్తూ కేజీ 5 రూ. లకు విక్రయిస్తూ వినూత్న నిరసన ప్రదర్శించారు. ఉచిత ఇసుక కేజీ ఐదు రూపాయలు మాత్రమే నని, ఉచిత ఇసుక అమ్మబడును అంటూ.. ఈవీఎం ప్రభుత్వం కేజీ ఇసుక ధర 5 రూపాయలు.. ఈవీఎం ఎమ్మెల్యే ఒక అనకొండ.. ఫ్రీ ఇసుక లారీ 30వేలు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. కార్యక్రమంలో రుడా చైర్మన్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్య ప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కానుబోయిన సాగర్, వైఎస్ఆర్సిపి నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, మాజీ కార్పొరేటర్ లో మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న, అన్నపూర్ణ రాజు, మార్తి నాగేశ్వరరావు, వట్టికూటి కృష్ణవేణి, అనంతలక్ష్మి, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, దుర్గారావు, సుంకర అంజిబాబు, దాసరి సాంబశివరావు, కొండ కుమారి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS