
బంగ్లాదేశ్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి వార్నింగ్
బంగ్లాదేశ్ తరుచూ భారత్ పట్ల అస్థిర దృక్పథాన్ని ప్రదర్శించడంపై భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ హెచ్చరించారు. హాస్యాస్పద వాదానలకు దూరంగా ఉండాలని ఢాకాకు సూచించింది. తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు తరచూ భారత్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రతి దానికి భారత్ కారణమని ఆరోపించడం వారికి అలవాటుగా మారిందని బంగ్లా తీరుపై ధ్వజమెత్తారు.
