Spread the love

సాగునీటి పంపకంలో తెలంగాణకు అన్యాయం

తెలంగాణలొ ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి కారణం సమైక్య పాలకులే

పదేళ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరగలేదని ఆధారాలు లేకుండా ని సిగ్గుగా ఆరోపించడం దారుణం…… మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి గత 40 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం సమైక్య పాలనలో నదులసాగు నీటి పంపకంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని సమైక్య పాలనలో ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెంపాడు బీమా ప్రాజెక్టులను రిజర్వాయర్లను పూర్తి చేయకుండా సాగునీరు అందక పల్లెలు కరువు కాటకాలతో ఆకలి చావులు వలసలతో ఎడారులుగా మారితే చూసి భరించలేక కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టడం జరిగిందని తెలంగాణ జేఏసీ జర్నలిస్టు జేఏసీలు విద్యాసాగర్ రావులాంటి వారు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సమైక్య రాష్ట్ర పాలకులను కేంద్ర పాలకులనుకోరినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని కెసిఆర్ సారధ్యంలో ప్రజలు, అందరి సహకారంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని తెలంగాణ రాష్ట్రం సహకారమైన తర్వాత కెసిఆర్ 10 ఏళ్ల పాలనలో చెరువులు కుంటలు రిజర్వాయర్లు చెక్ డ్యాములను నిర్మించి సాగునీటితో నింపి తెలంగాణ పల్లెలను పచ్చగా సస్యశ్యామలంగా మార్చి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్నికి ఉన్నత స్థానాన్ని కల్పించడం జరిగిందని ఇప్పుడుగద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సదరు మంత్రులు కెసిఆర్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అసలు ఎలాంటిఅభివృద్ధి జరగలేదని ఆధారాలు లేకుండా నీ సిగ్గుగా ఆరోపిస్తున్నారని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాగవరం వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంచనా వేసి పూర్తి చేసేందుకు యత్నిస్తే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నాయకులు కేసులు వేసి పరిహారం పేరుతో వేధించి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చింది మీరు కాదా అని ప్రశ్నించారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఎందుకు ప్రయత్నించేయడం లేదని ఇరు రాష్ట్రాలకు కృష్ణ గోదావరి నదీ జలాలను పంపిణీ చేయాల్సింది కేంద్రమే కదా మరి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో సమాధానం చెప్పాలన్నారు సాగునీటి పంపకం కోసం ధర్నాలు ఎందుకు చేయడం లేదని ఒకవేళ రేవంత్ రెడ్డి ధర్నా చేపడితే ప్రతిపక్షంగా బి ఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా పాల్గొంటారని మాజీ మంత్రి తెలిపారు ఇకపోతే కాలేశ్వరం ప్రాజెక్టు ను అనథి కాలంలోనే పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే ప్రాజెక్టు పేరుతో 200 లక్షలు కోట్లు కేసీఆర్ హరీష్ రావులు స్వాహా చేశారని ప్రచారం చేయడం దారుణమని అసలు ప్రాజెక్టు అంచనా 96 లక్షల మాత్రమే అయితే 200 లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగిందోఅర్థం కావట్లేదు అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 15 నెలలు అవుతున్న ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు ఉన్న రైతు భరోసా రైతులకు ఇవ్వలేదని గతంలో 66 లక్షల ఎకరాలకు రైతు బంధు పేరుతో ఎలాంటి నిబంధన లేకుండా రైతులకు సాగు సహాయం అందిస్తే పలు నిబంధనల తో కొర్రీలు పెట్టి నేడు దాన్ని 54 లక్షల ఎకరాలకు కుదించి 9:30 లక్షల ఎకరాలకు కోతపెట్టారని అన్నారు ఎకరాకు 15 వేలు ఇస్తామని ఇప్పుడు అది 12 వేల కుదించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మాజీమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ బోలెమోని లక్ష్మయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ బి ఆర్ ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ రఘుపతి రెడ్డి కురుమూర్తి యాదవ్ మార్కాపూర్ డైరెక్టర్ విజయకుమార్ కర్రే స్వామి వనం రాములు దిలీప్ రెడ్డి వేణు యాదవ్ మాణిక్యం చంద్రశేఖర్ నాయక్ ధర్మానాయక్ హరి శంకర్ నాయుడు పెద్దింటి వెంకటేష్ రాజశేఖర్ ఎద్దుల సాయికుమార్ గంధం పరంజ్యోతి నాగన్న యాదవ్ స్టార్ రహీం ప్రేమ్ నాథ్ రెడ్డి ఇమ్రాన్ హేమంత్ ముదిరాజ్ మహేశ్వర్ రెడ్డి చిట్యాల రాము జోహార్ ఆరిఫ్ క్రాంతి కుమార్ మున్నయ్య రామస్వామి తదితరులు పాల్గొన్నారు