
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ఈనెల 29 వరకు జరగనున్నాయి. ఉ. 9 నుంచి మ. 12 గంటల వరకు ఫస్టియర్, మ.2.30 నుంచి సా. 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2,66,207 మంది ఫస్టియర్ పరీక్షలు, 1,47,390 మంది సెకండియర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం 30 నిమిషాల ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు.
