TEJA NEWS

సాక్షిత :- చిలకలూరిపేట

ఇంటర్నేషనల్ షిరిడి సాయి సమాజ్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా డాక్టర్ పూసపాటి బాలాజీ —ఔరంగాబాద్ కు చెందిన ఇంటర్నేషనల్ షిరిడి సాయి సమాజ్ కు ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా మరోసారి చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పుష్పాటి బాలాజీ నియమింపబడ్డారు, నిన్న పదో తారీకు ఆదివారం ఔరంగాబాద్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, దేశవ్యాప్తంగా 108 శాఖలు కలిగి షిరిడిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలో పలుచోట్ల సాయి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ షిరిడి సాయి సమాజ్ బాలాజీ చేస్తున్న సేవలను గుర్తించి నాలుగవసారి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా మరొకసారి నియమించారు, షిరిడి సాయి సమాజ్ గ్లోబల్ చైర్మన్ కె సుందర్ శర్మ ఈ నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా బాలాజీకి అందజేశారు, ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ షిరిడి సాయి సమాజ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల అనేక సేవా కార్యక్రమాలు పేదలకు ఉచిత వైద్య నిత్యవసర సరుకుల పంపిణీ జరుపుతున్నామని మరొకసారి ఎంపి చేయటం ఆనందంగా ఉందని దీని ద్వారా బాబా యొక్క అనుగ్రహం సంపూర్ణంగా నాపై ఉందని ట్రస్ట్ ప్రెసిడెంట్ పాస్వర్డ్ బాలాజీ తెలియజేశారు, ఇదంతా చిలకలూరిపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలు దాతల సహకారంతో నేను చేస్తున్న కార్యక్రమాలకు తగిన గుర్తింపుగా బాబా గారి ప్రసాదంగా ఈ పదవి వచ్చిందని తెలియజేశారు, దీంతో పలువురు పట్టణ ప్రముఖులు బాలాజీని అభినందించారు


TEJA NEWS